అధికార ప్రతిపక్ష పార్టీలపై అదిరిపోయే పంచులు వేసిన జనసేన పార్టీ..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీని మరియు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చెడుగుడు ఆడుకుంటుంది జనసేన పార్టీ. ముఖ్యంగా ఇటీవల సోషల్ మీడియాలో వైసీపీ పార్టీకి చెందిన నాయకులు తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలకు కౌంటర్లు వేస్తూ పోస్టులు పెడుతూ విమర్శలు చేస్తూ తిరిగి కౌంటర్ లు ఇస్తున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా ఇటీవల వైసీపీ పార్టీకి చెందిన నాయకులు జాతిపిత మహాత్మా గాంధీ దిమ్మకు వైసిపి పార్టీ రంగులు వేసినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ చేసిన పనిని ట్రోల్ చేయడంపై వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి స్పందించారు.

తాజాగా విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ఎకౌంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న హడావిడి ప్రస్తావిస్తూ…గాంధీ దిమ్మెకు వైసీపీ రంగులేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుడ్డలు చింపుకుంటున్నాడని అన్నారు. అప్పడాల పైన, నీళ్ల ప్యాకెట్ల పైన ఫొటోలో వేయించుకున్న విషయం మీరు మర్చిపోయిన ప్రజలు మర్చిపోలేదు అని తెలిపారు. గుళ్ళల్లో కూడా పసుపు రంగు వేయించలేదా బాబు? అంటూ విజయసాయిరెడ్డి టీడీపీ చర్యల్ని గుర్తు చేసారు. దీంతో వెంటనే స్పందించిన జనసేన పార్టీ భలే పోల్చుకుంటున్నారు ఒకరిపై ఒకరు ఎంతైనా మీరు మీరు ఒకటే అన్నట్లుగా వైసీపీ మరియు టిడిపి పెట్టిన పోస్టులను జత పరుస్తూ జనసేన పార్టీ నేతలు కామెంట్లు చేశారు. అంతేకాకుండా ఇరుపార్టీలు చేసుకున్న కామెంట్లను పోస్టులను సోషల్ మీడియాలో జతపరిచి మరియు పరువు తీశారు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు.

kittusiva

kittusiva

Leave a Replay