Movies

సంక్రాంతి టార్గెట్ మహేష్.. అల్లు అర్జున్ ది అదే..?

sankranthi release telugu movies 2020

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాలు రాబోయే సంక్రాంతికి జనవరి మాసంలో విడుదలవుతున్న విషయం అందరికీ తెలిసినదే. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన పాటలు మరియు టీజర్ సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. పాటల విషయంలో అలా వైకుంఠపురం లో సినిమా ప్రేక్షకులను అల్లరిస్తుంటే…సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ అభిమానులను అలరిస్తోంది. ఇద్దరి సినిమాలు ఒక రోజు గ్యాప్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో మహేష్, బన్నీ సినిమాల సంక్రాంతి టార్గెట్ హ్యాట్రిక్ అన్నట్టు వినబడుతోంది.

స్ట్రైట్ గా విషయంలోకి వెళ్తే అల్లు అర్జున్ నటిస్తున్న అలా వైకుంఠపురం లో సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ‘అలా వైకుంఠపురం లో’ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని…అల్లుఅర్జున్ తాపత్రయ పడుతూ ఉండగా మరో పక్క సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ లాంటి రెండు సూపర్ డూపర్ వరుసగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తన ఖాతాలో పడటంతో…’సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని మంచి కసిమీద ఉన్నట్లు సమాచారం. 

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close