Vijay Devarakonda on Sunday at his new home…!

‘అర్జున్ రెడ్డి’ సినిమా తో అదిరిపోయే హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వెంటనే వరుస అవకాశాలు అందుకుని చేతినిండా సినిమాలు చేసి అతి తక్కువ బడ్జెట్ లో ‘గీత గోవిందం’ అనే సినిమా చేసి 100కోట్ల క్లబ్బులో చేరడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ తన క్రేజ్ సౌత్ ఇండస్ట్రీ మొత్తం వ్యాప్తి చెందాలని భావిస్తున్న విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న అన్ని ఇండస్ట్రీ భాషల్లో విడుదల చేసి దారుణమైన ఫ్లాప్ చూడటం జరిగింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సౌత్ అన్ని ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా చేస్తున్నాడు. నలుగురు హీరోయిన్లతో అద్భుతమైన ప్రేమకథతో నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమా తరహాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఉండబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల ఆదివారం నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ…ఫిలిం నగర్ లో ఒక కొత్త ఇంటిలో స్నేహితులతో కలిసి గృహప్రవేశం చేసినట్లు ఫిలింనగర్ లో టాక్ వినపడుతుంది. పెద్ద ఆర్బాటం ఏమీ లేకుండా కొద్ది మంది స్నేహితులతో…విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమం సెలబ్రేట్ చేసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.  

Related posts

Pawan Kalyan to make a comeback

Pawan Kalyan backs down in English Medium

English Medium decision taken by AP Government