ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకువస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో విభేదించటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ప్రముఖ సామాజిక వేత్త కంచే ఐలయ్య తాజాగా ఈ విషయంపై స్పందించారు. ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం పెట్టాలని డిమాండ్ చేస్తున్న వారు ప్రైవేటు స్కూళ్ళలో తెలుగు మీడియం పెట్టాలని ఎందుకు అడగడం లేదని ప్రముఖ విద్యావేత్త కంచె ఐలయ్య అన్నారు.
ఒక సదస్సులో ఆయన మట్లాతుఊ ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం పెట్టాలని అనేవారు తమ పిల్లలను ఎందుకు తెలుగు మీడియంలో చదివించడం లేదని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఎపిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఆంగ్ల మీడియం పెట్టాలని తమ బృందం కలిసినప్పుడు తమ పార్టీ పేరు తెలుగుదేశం కదా..తెలుగు మీడియా లేకుండా ఎలా అని ప్రవ్నించారని, అప్పుడు మరి మీ అబ్బాయి లోకేష్ ను ఇంగ్లీస్ ఎలా చదివించారని ప్రశ్నించిందని ఆయన చెప్పారు. ప్రబుత్వ స్కూళ్లలో తెలుగు మీడియా అవసరం లేదని, ఒక సబ్జెక్ట్ గా ఉంటే సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణలో తెలుగు,ఇంగ్లీష్ మీడియంలు ఉన్నా, తెలుగు మీడియంలో ఎవరూ చేరడం లేదని ఆయన అన్నారు.బడుగు వర్గాల పిల్లలు కూడా ఐఎఎస్ వంటివాటిలో పోటీ వస్తారనే కొందరు ఆంగ్ల మీడియంను వ్యతిరేకిస్తున్నారని ఐలయ్య ఆరోపించారు.తాను ఇంగ్లీష్ లో రచయితనని, అలాగే తెలుగులో కూడా రాయలగలనని ,గ్రామ ప్రాంతం నుంచి వచ్చానని ఆయన అన్నారు.