జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన ఎక్కడా కూడా ప్రజా సమస్యల విషయంలో రాజీపడకుండా వైసిపి పార్టీ అధినేత జగన్ ని టార్గెట్ చేస్తూ తీవ్రమైన విమర్శలు కురిపిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కంచుకోట రాయలసీమ ప్రాంతంలో డిసెంబర్ 1వ తేదీ నుండి ఆరవ తేదీ వరకు పర్యటన జరపటానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైన తరుణంలో పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో చిత్తూరు కడప జిల్లాలో పర్యటిస్తూ రాయలసీమ రైతాంగ సమస్యలను మేధావులతో పాటు తెలుసుకోవడానికి చర్చలు చేపట్టబోతున్నారు. డిసెంబర్ 1 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్తారు.
3 గంటలకు రైల్వే కోడూరు చేరుకొని కడప జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు.కడప జిల్లాపార్టీ నేతలు, శ్రేణులతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరితిరుపతికి పయనమవుతారు. 2 వ తేదీ ఉదయం 10 గం. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్
నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 3 వ తేదీన కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాలపరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్ష ఉంటుంది. 4 వ తేదీ మదనపల్లె చేరుకుంటారు. అక్కడి జనసేన శ్రేణుల స్వాగతం అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. అక్కడే బస చేస్తారు. 5 వ తేదీ అనంతపురం జిల్లా నేతలతో సమీక్ష సమావేశం ఉంటుంది. తదుపరి స్థానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చిస్తారు. 6 వ తేదీన పార్టీ కార్యక్రమాలలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు.