వైసిపి పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద పిల్లలకు ఉన్నత చదువులు దూరమవుతున్న తరుణంలో పెద్దపెద్ద ఉద్యోగాలకు వారి జీవితాలు అందుకోలేని స్థితిలో ఉన్న క్రమంలో… అందరికీ అందుబాటులో ఇంగ్లీష్ మీడియం ఉండాలని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా జగన్ తీసుకురావాలని భావించి ఇటీవల ప్రకటించిన సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర స్థాయిలో విభేదించారు.
చంద్రబాబు ఇంగ్లీష్ మీడియంను విమర్శిస్తే పవన్ అదే పనిచేశారు. ఆ తర్వాత చంద్రబాబు యు టర్న్ తీసుకుని ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని ప్రకటిస్తే, తాజాగా పవన్ కళ్యాణ్ కూడా అలాగే యుటర్న్ తీసుకున్నారట.‘ఇంగ్లీష్‌ను వద్దనడం లేదు.. మాతృభాష వదలొద్దు అంటున్నాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ అరవిందరావు ‘తెలుగు వర్దిల్లతేనే వెలుగు’ అన్న పేరు తో తెలుగు భాషా పరిరక్షణ’, గురించి రాసిన వ్యాసం,అన్ని కోణాలలో చాల విశ్లేషణాత్మకంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని లోని అంశాలని పరిశీలించాలి’ అని మరో ట్వీట్ చేశారు.