Movies
సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా ఇటీవల వివాదాస్పద సినిమాలు చేస్తూ కెరియర్ ని కొనసాగిస్తున్న రామ్ గోపాల్ వర్మ…దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డైరెక్టర్ ఆర్జివి తనదైన శైలిలో చూపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత రాజకీయంగా చోటుచేసుకున్న పరిణామాలను చూపిస్తూ ప్రముఖ రాజకీయ నేతల క్యారెక్టర్లను తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించే విధంగా చిత్రీకరిస్తూ…సినిమాకి సంబంధించిన అప్డేట్ మరియు ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఇదిలా ఉండగా నవంబర్ 29వ తారీఖున ఈ సినిమా విడుదల కాబోతున్న నేపద్యంలో సినిమా ప్రమోషన్స్ అదరగొట్టే రేంజిలో చేయాలని భావిస్తున్నారు.తాజాగా ఈ సినిమా గురించి స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి ఎవరిని టార్గెట్ చేసి తీయలేదని క్లారిటీ ఇచ్చారు.