ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకు రావడంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలుగు భాషకు తెగులు పుట్టించే విధంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు చేస్తూ వస్తున్న తరుణంలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు. రంగరాజన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలలో ఇంగ్లీష్ మీడియం పై వస్తున్న వార్తలు గురించి స్పందిస్తూ…తెలుగు గొప్పా, ఇంగ్లీష్ గొప్పా అనే వాదనలు పక్కన పెట్టి విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించేయాలన్నారు.
తెలుగుకు తాను వ్యతిరేకం కాదని, అలాగని ఇంగ్లీష్ బాషకు కూడా అనుకూలం కాదని చెప్పారు. తమిళనాడు, కర్నాటక తరహాలో న్యాయస్థానాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో మాతృభాష వాడుతున్నట్లుగా.. ఏపీలో కూడా తెలుగు వాడకం తీసుకురావాలన్నారు. అంతేకానీ.. పాఠశాలల్లో ఏ మీడియం అన్నదానిపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఇక అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పించిన సీఎం జగన్కు రంగరాజన్ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో వైసిపి పార్టీ నేతలు నాయకులు సోషల్ మీడియాలో రంగరాజన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇంగ్లీషు భాష కి మరియు మతానికి ఎటువంటి సంబంధం లేదని మరొకసారి రుజువైందని మతం పై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నా విమర్శలకు కౌంటర్లు వేశారు.