యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి లాంటి భారీ విజయం తర్వాత నటించిన సాహో సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై దారుణంగా ఫ్లాప్ అవ్వడం జరిగింది. ఈ సినిమా కోసం దాదాపు ప్రభాస్ రెండు సంవత్సరాలు టైం కేటాయించడంతో…వచ్చిన రిజల్ట్ చూసి ప్రభాస్ అభిమానులు ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో ఆ తర్వాత జిల్ ఫేం డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పాతకాలంనాటి లవ్ స్టోరీ నేపథ్యం కలిగిన సినిమా ని స్టార్ట్ చేశాడు ప్రభాస్. ఆ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. కాగా సినిమా మొదలయ్యే చాలా రోజులైనా కానీ ఇప్పటికి ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి వార్తలు సినిమా యూనిట్ బండి రాకపోవడంతో అదేవిధంగా సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు ఇటీవల వార్తలు వస్తున్న క్రమంలో…ఈ నేపథ్యంలో వస్తున్న వార్తల విషయంలో సినిమా యూనిట్ ఎలాంటి సమాచారాన్ని భయటపెట్టకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో రెచ్చిపోయారు. తమ అభిమాన హీరో 20వ సినిమా గురుంచి అప్డేట్ ఇవ్వాలని కోరుతూ we want prabhas 20 update అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ యువీ క్రియేషన్స్ కి ట్యాగ్ చేస్తున్నారు. ఇంకేముంది ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయి ట్వీట్లు చేస్తుండడంతో ఈ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగ్ గా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో మరియు ఫిలింనగర్లో వైరల్ అవుతుంది.
Prabhas fans who created a new trend on Twitter…?
891