భారతీయ చలన చిత్ర రంగం అంటే ఒకప్పుడు గుర్తుకు వచ్చే పేరు బాలీవుడ్ ఇండస్ట్రీ. అయితే తాజాగా మాత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ప్రపంచ సినిమా రంగానికి గుర్తుకు వచ్చే పేరు దిగ్గజ దర్శకుడు రాజమౌళి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బాహుబలి వంటి భారీ విజయం ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ లో హిట్ కావడంతో రాజమౌళి పేరు మారుమ్రోగింది. ఇటువంటి నేపథ్యంలో బాహుబలి తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో RRR అనే మల్టీ స్టారర్ సినిమా వస్తున్న విషయం అందరికీ తెలిసినదే.
జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి మొట్టమొదటిసారి నటిస్తున్న ఈ సినిమా కోసం రాజమౌళి భారీ స్థాయిలో నిర్మాత డివివి దానయ్య చేత ఖర్చు పెట్టిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల చేయాలని భావించిన రాజమౌళి తాజాగా పది భాషల్లో సినిమా విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ సపరేట్ మార్కెట్ ఏర్పడటంతో అమెరికా యూరప్ కంట్రీలలో ఇంగ్లీష్ భాషలలో కూడా ఈ సినిమాని విడుదల చేసి హాలీవుడ్ స్థాయిలో తనకంటూ సపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి రాజమౌళి తాజాగా రెడీ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి.