ఆ టైమ్ లో సూసైడ్ చేసుకోవాలని అనుకుందట ఇలియానా..?

‘దేవదాసు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఇలియానా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ సినిమాతో అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో ఇలియానా చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరు పక్కన నటించి తనకంటూ సపరేట్ క్రేజ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏర్పరచుకుంది. అయితే వరుస అవకాశాలు వరుస విజయాలు సౌత్ ఇండస్ట్రీ లో వస్తున్న తరుణంలో ఇలియానా కన్ను బాలీవుడ్ ఇండస్ట్రీ పై పడింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడి పోదామని భావించి సౌత్ లో వచ్చిన అవకాశాలని వదులుకున్న ఈ సన్నని నడుము గల ముద్దుగమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు దక్కించుకుని సినిమాలు చేసింది.

 

అయితే చేసిన సినిమాలు ఏది కూడా సరైన విజయం సాధించకపోవడంతో మరోపక్క అవకాశాలు తగ్గడంతో కెరియర్ క్రమక్రమంగా డౌన్ ఫాల్ కావడంతో…ఫుల్ డిప్రెషన్ లోకి ఇలియానా వెళ్లిపోవడంతో…ఆ టైమ్ లో సూసైడ్ చేసుకోవాలని ఇలియానా అనుకున్నట్లు…ఇటీవల మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా రోజు నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకోవడంతో అప్పట్లో ఇలియానా లావు అయ్యిందట. ఇదిలా ఉండగా మళ్లీ ఇలియానా సౌత్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి తిరిగి అవకాశాలు పొందటానికి రెడీ అయినట్లు ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినిమా చర్చల దశలో ఉన్నట్లు ఆ సినిమా కోసం ఇలియానా లావు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. మొత్తంమీద చూసుకుంటే లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్లీ ఇలియానా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

kittusiva

kittusiva

Leave a Replay