ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ రికార్డు ఇంకా అలానే ఉంది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పోటీ చేసి రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయినా గాని ఎక్కడా కూడా ప్రజా సమస్యల విషయంలో రాజీపడకుండా అధికార పార్టీ జగన్ పార్టీపై పోరాడుతూ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజా పవన్ కళ్యాణ్ నటించిన చివరి సినిమా ‘అజ్ఞాతవాసి’ సినిమా టీజర్ రికార్డు గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నారు అన్న తరుణంలో వచ్చిన ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మెగా అభిమానులు. దీంతో ఆ సందర్భంలో టీజర్ రిలీజ్ కావడంతో 24 గంటల్లో ఈ సినిమా టీజర్ నెలకొల్పిన రికార్డులు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. విషయంలోకి వెళితే 24 గంటల్లో నెలకొల్పిన రికార్డులను పాన్ ఇండియన్ చిత్రంగా తెరకెక్కిన సాహో కొట్టెయ్యగా ఇప్పుడు దాన్ని కూడా కొట్టేందుకు మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ సిద్ధం అయ్యింది.

కానీ ఏఈ రెండు టీజర్లు కూడా కొట్టని రికార్డు ఇంకా పవర్ స్టార్ బార్డర్ లోనే ఉందని సోషల్ మీడియాలో పవన్ అభిమానులు అంటున్నారు.అత్యంత వేగంగా 3 లక్షల లైక్స్ సాధించిన టీజర్ వీడియోగా ఇంకా “అజ్ఞ్యాతవాసి” పేరిటే రికార్డు ఉందని ఈ ఫీట్ సాధించడానికి పవన్ సినిమాకు 4 గంటల 32 నిముషాలు టైం పడితే “సాహో”కు 4 గంటల 45 నిముషాలు అలాగే “సరిలేరు నీకెవ్వరు”కి 4 గంటల 48 నిముషాలు పట్టింది.మొత్తానికి పవర్ స్టార్ రికార్డు మాత్రం ఇంకా బద్దలవ్వలేదని వాదన సోషల్ మీడియాలో వినబడుతోంది. 

kittusiva

kittusiva

Leave a Replay